Blog

పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి ? ఇంట్లో గుర్తించుటకు 10 ప్రారంభ సంకేతాలు మరియు కట్టడి చేయడం ఎలా ?

మన మెదడు మన శరీర భాగాలకు నరాల ద్వారా సందేశం పంపి శరీర విధులు మరియు కదలికలను నియంత్రిస్తుంది. మన నరాలు “న్యూరోట్రాన్స్మిటర్స్” అనే రసాయనాలను కలిగి  ఉంటాయి. కదలికల వేగాన్ని నియంత్రించడానికి మరియు ప్రణాళిక చేయడానికి బాధ్యత వహించే అటువంటి న్యూరోట్రాన్స్మిటర్‌ను “డోపామైన్” అంటారు. ఇది మన మెదడు కాండంలో ఉత్పత్తి అవుతుంది. డోపామైన్ ఉత్పత్తిలో 70-80% తగ్గింపు ఉన్నప్పుడు, పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి.

 

కొన్ని వాస్తవాలు:

 • పార్కిన్సన్స్ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించనప్పటికి, మీ కుటుంబంలో ఎవరైనా దానిని కలిగి ఉంటే, మీకు వ్యాధి సంక్రమించుటకి 10-15% ఎక్కువ అవకాశం ఉంది.
 • ఇది ఏ వయసులోనైనా మిమ్మల్ని ప్రభావితం చేసినప్పటికీ, సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారు ప్రభావితమవుతారు.
 • ఇది ప్రాణాంతకం కాదు, అయినప్పటికీ దీనికి ఇంకా చికిత్స లేదు.
 • మహిళల కంటే పురుషులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది
 • భారతదేశంలో ప్రస్తుతం సుమారు 60 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, పార్సీ సమాజంలో ప్రమాదం అత్యధికం గా ఉంది
 • పురుగుమందుల బారిన పడటం పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడే అవకాశాన్ని పెంచుతుంది

ఇంట్లో దాన్ని ఎలా గుర్తించగలం?

మనం తెలుసుకోవలసిన పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభ సంకేతాలు కొన్ని ఉన్నాయి, ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణ అయినట్లయితే,సరైన దశలో మందులతో, పార్కిన్సన్స్ వ్యాధి యొక్క అనేక లక్షణాలని కొన్ని సంవత్సరాలు ఆలస్యం చేయవచ్చు:

 • విశ్రాంతి తీసుకునేటప్పుడు చేతులు, వేళ్లు, గడ్డం మొదలైన వాటిలో వణుకు ఉండటం
 • చేతివ్రాత చిన్నది అవ్వటం
 • వాసన చూడలేకపోవడం
 • సరిగ్గా నిద్రపోవడంలో ఇబ్బంది
 • నడకలో ఇబ్బంది – అడుగులు నేలకి చిక్కుకుంటాయి, లేదా భుజాలు లేదా తుంటిలో దృఢత్వం
 • మలబద్ధకం
 • స్వరములో మార్పు – మృదువుగా లేదా తక్కువగా మారటం
 • ముఖం ఎప్పుడు తీవ్రంగా లేదా నిరుత్సాహంగా కనిపించటం, దీనిని “ముసుగు ముఖం” అని కూడా పిలుస్తారు
 • మైకము లేదా మూర్ఛ
 • కిందికి లేదా ముందుకి వంగటం

 

పార్కిన్సన్స్ వ్యాధిని ఎలా నివారించాలి?

ఖచ్చితమైన సూత్రం లేదు, కానీ పార్కిన్సన్స్ వ్యాధి తగ్గించడానికి ఈ క్రిందివి ఉపయోగపడతాయి :

 • కాఫీ తాగడం
 • యాంటీ ఇన్ఫ్లమేటరీ (శోథ నిరోధక) మందులు – ఉదాహరణలు: బ్రూఫెన్, కాంబిఫ్లామ్, ఉనాఫెన్
 • అధిక విటమిన్-డి
 • వ్యాయామం – ఎల్డర్ఈజ్లో పలు రకాల ఉత్పత్తులు ఉన్నాయి (దయచేసి మరింత సమాచారం కోసం లింక్‌పై క్లిక్ చేయండి), ఇవి శారీరక పరిమితులతో కూడా వ్యాయామం చేయడానికి మీకు సహాయపడతాయి.

పార్కిన్సన్స్ వ్యాధిని ఎలా కట్టడిచేయాలి?

 • న్యూరాలజిస్ట్‌ ( నాడీవ్యవస్థ శాస్త్రనిపుణుడు)ను సంప్రదించండి
 • యు-స్టెప్ వాకర్” అని పిలువబడే ప్రత్యేక వాకర్‌ను ఉపయోగించి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఇది పార్కిన్సన్స్ వ్యాధితో సంబంధం ఉన్న చలనశీలత సమస్యలను పరిష్కరిస్తుంది.
  • నడక వేగం
  • నడుస్తున్నప్పుడు తిరగడంలో ఇబ్బంది
  • కాళ్ళు ఇరుక్కుపోవడం
  • నడుస్తున్నప్పుడు కిందపడిపోతాము అన్న భయం
 • కుటుంబం మరియు స్నేహితులతో మాట్లాడటం మరియు మద్దతు పొందడం

Related Posts