Blog

“ఎ వాక్ టు రికవరీ”

రవి * బాధపడుతూ ఉండేవాడు . కొంతకాలం క్రితం అతని తల్లి మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. కాని ఆమె చాలా నెమ్మదిగా కోలుకుంటు ఉండేది. అతని తల్లి ఆపరేషన్ చేయించుకోవటానికి సంకోచించింది, కాని రవి తన తల్లి శస్త్ర చికిత్స తరువాత మరింత చురుకుగా ఉంటుంది , బయటకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించగలదు అని భావించి ఆమెను బలవంతం చేసాడు. కానీ పాపం, ఆపరేషన్ జరిగి 6 నెలలు గడిచినా అతని తల్లి తన ఇంటి నుండి బయటికి వెళ్లలేక పోయేది . కొంతకాలం తర్వాత, ఫిజియోథెరపీ సెషన్లు కూడా ఆగిపోయాయి. రవి తల్లి బరువు పెరగడం ప్రారంభించింది.

1. ఆమె బరువు పెరుగుతున్నందున ఆమె వ్యాయామం చేయలేకపోయింది.

2. ఆమె వ్యాయామం చేయలేకపోవడంతో ఆమె బరువు పెరిగింది.

ఇలా సమస్య మరింత జటిలం అయింది.

ఆమె ఒంటరిగా నివసించినప్పటికి, స్నేహితులు మరియు బంధువులు ఆమెను సందర్శిస్తూ ఉండేవారు. ప్రతి సారి తామే ఎందుకు వెళ్లి కలవాలని భావించి కొంతకాలం తరువాత కలవడం మానేశారు. దానితో ఆమె మరింత ఏకాంతంగా జీవించడం ప్రారంభమైంది . తన అభిప్రాయం ప్రకారం రవి తాను చేయగలిగినది చేసాడు . అతను ఒక వాకరును కూడా కొనుగోలు చేశాడు, అది అతని తల్లి తిరగటానికి ఉపయోగించుకోవచ్చు. అది ఒక ప్రామాణిక వాకర్, అందరికి అందుబాటులో ఉండేది మరియు తెలిసినది.

అయితే, దీని తరువాత కూడా అతని తల్లి కోలుకోవడానికి ఆసక్తి చూపలేదు. అతను ఫోన్లో ఎప్పుడు అడిగినా, ఆమె ప్రయత్నిస్తున్నట్లు ఆమె సమాధానం ఇస్తుండేది , కానీ ఆమె స్వరం క్రమేపీ మరింత నిరుత్సాహపడుటున్నట్టు ఉండేది . అతని సోదరి శ్వేత * తల్లిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు, శ్వేత రవితో అతని తల్లి బయటకు వెళ్లకపోవడానికి నాలుగు కారణాలు ఉన్నాయని పేర్కొంది.

1. వాకరు చాలా స్థూలంగా, భారీగా ఉంది. వాకరు వాడటానికి ఆమెకు ఎవరి సహాయమైన అవసరం ఉండటం.
2. వాకరుతో ఆమె అప్పుడే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చినట్లు ఉండిక్ అని బంధువులు అనడం.
3. కొంత దూరం నడిసాక ఆమె అలసిపోయేది – దానితో ఆమె కుర్చొవటానికి ఇంటికి తీసుకువెళ్లమని ఆమె అడిగేది.
4. వాకరు వాడుతుండటంతో జనాలు ఆమె పట్ల జాలిగా చూడటం ఆమెను బాధించింది. ఈ సమస్య శ్వేతని ఆలోచించేలా చేసింది. తేలికైన, ఎక్కడికైన తీసుకువెళ్లటానికి సులభమైన మరియు అవసరమైనప్పుడు సీటుగా మారగల వాకర్ ఉందా అని ఆమె అంతర్జాలంలో ( ఇంటర్నెట్) వెతికింది . ఆమెకి పరిష్కారం ఇక్కడ దొరికింది.

ఆమె తల్లి అలసిపోయినప్పుడు ఈ వాకరు సీటుగా కూడా పనిచేస్తుంది

సంక్షిప్తంగా, ఆమె తన తల్లిని BMW కి అప్‌గ్రేడ్ చేసినట్లు అయింది ! రవికి చెప్పకుండా శ్వేత తన అమ్మ కోసం ఆర్డరు చేసింది. రెండు రోజుల్లో ఆమె తల్లి వాకిలికి దాకా నడవగలిగింది, ఒక వారంలో – ఆమె పార్కులో ఉంది. ఇవి రవికి తెలియవు.

రెండు నెలల తరువాత, ఒక ఆదివారం రవి తన జె.పి. నగర్ నివాసంలో సరదాగా నెట్‌ఫ్లిక్స్ ఆస్వాదిస్తున్న వేళ, ఎవరో తన ఇంటి తలుపును తట్టారు. తలుపు దగ్గర ఉన్నది ఎవరో కాదు, అతని తల్లి! తన కొడుకును ఆశ్చర్య పరిచేందుకు ఆమె 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించింది. ఆమె చాలా సంతోషంగా మరియు ఆరోగ్యంగా కనిపించింది. "రవి , శ్వేత నాకు BMW ను బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు నేను ఆందోళన చెందుతున్న ఏకైక విషయం ఏమిటంటే, నేను ఎప్పుడు ఆడటానికి మనవడిని పొందుతాను ” అని ఆమె చెప్పడంతో రవి ముఖం ఆనందంతో నిండిపోయింది.

* నిజమైన అనుభవం ఆధారంగా. గోప్యతను కాపాడటానికి పేర్లు మార్చబడ్డాయి.

Related Posts